సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎండీ రఘుమారెడ్డి..

95
CMD Raghuma Reddy
- Advertisement -

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ఉద్యోగులకు కోవిడ్ వాక్సినేషన్ అందించే ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని తెలంగాణ ట్రాన్స్ కో & జెన్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరై, SPDCL సంస్థ సీఎండీ గౌరవరం రఘుమా రెడ్డి సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా డి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, తాము విన్నవించుకున్న వెంటనే రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించి, వారికి వెంటనే కోవిడ్ వాక్సిన్ అందించేలా ఆదేశాలు జారీ చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి సంస్థ ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి,చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 50000 మంది విద్యుత్ ఉద్యోగులందరికీ వాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి అపోహలు లేకుండా వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ రోజు మొదటి డోస్ తీసుకున్న వారు విధిగా 28 రోజుల తరవాత రెండో డోసును కూడా తీసుకోవాలన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకందరికి వాక్సిన్ అందించటం అంటే సాధారణ విషయం కాదని, ట్రాన్స్ కో & జెన్ కో సీఎండీ డి ప్రభాకర్ రావు చేసిన కృషి వలననే ఈ రోజు ఈ బృహత్తర కార్యక్రమం సాధ్యమయ్యిందని కొనియాడారు. తమ ఉద్యోగులకు వాక్సిన్ సౌకర్యాన్ని కలిగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి, విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డికి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు, ఆరోగ్య శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు వాక్సిన్ వేసుకున్నా కూడా విధి నిర్వహణలో కోవిడ్ భద్రతా ప్రమాణాలు పాటించాలని, కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని ఉద్యోగులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ Dr.పావని, డైరెక్టర్లు టి శ్రీనివాస్,జె శ్రీనివాస రెడ్డి,కే రాములు,జి పర్వతం, పి నరసింహ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -