- Advertisement -
సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం యాదాద్రి పునఃర్నిర్మాణ కట్టడాలను పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో యాదగిరిగుట్ట పునఃర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
- Advertisement -