బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ అకాల మరణం చెంది ఈరోజుకి ఏడాది పూర్తి అవుతుంది. గత ఏడాది జూన్ 14న సుశాంత్ తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్టు చెప్పుకు రాగా, ఆయన మరణంపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనది బలవన్మరణం కాదు హత్య అని బలంగా చెప్పడంతో ఈ కేసు సీబీఐకు కూడా చేరింది. సుశాంత్ చనిపోయి ఏడాది అయిన, ఇప్పటికీ దీనిపై క్లారిటీ రాలేదు.
ఇక సుశాంత్ మరణం ఆయన అభిమానులని ఎంతగానో కలవరపరచింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిష్క్రమణతో సినీ లోకం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. హిందీ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ముఖంలో అమాయకత్వం.. అలరించిన అతని నటన్ని తల్చకుంటూ హఠాత్తుగా అతను లేడనే వార్తని అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే అతని మరణం పూర్తైన ఏడాది రోజున మళ్లీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో కూడిన www.ImmortalSushant.com అనే వెబ్‌సైట్‌ని కుటుంబ సభ్యులు సాయంతో ప్రారంభించారు. ఇందులో సుశాంత్‌కి సంబంధించిన వివరాలు, సుశాంత్ వీడియోలు, ఫొటోలు చూడవచ్చు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి సన్నిహితుడైన నీలోత్పల్ మృణాళ్ మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితానికి సంబంధించిన సమాచారమంతా ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుందన్నారు.