- Advertisement -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. సభాపతి పోచారంతో పాటు లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు సభాపతి వెంట ఉన్నారు.
- Advertisement -