సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్…క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని వెల్లడించారు.
జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేండ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటీ రంగం 6.28 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు.
2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లుగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని …పెట్టుబడులు, అంకెలే మా వృద్ధికి సంకేతం అని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకూ శరవేగంగా ఐటీ విస్తరిస్తున్నదని తెలిపారు.