- Advertisement -
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రంగా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసివుంది. అయితే మిగతా సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా వాయిదా వేసుకుంది. ఏప్రిల్ నుంచి మే నెలకి వాయిదా పడిన ఈ సినిమా, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అలా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉండటంతో, ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. సాయిపల్లవిపై చిత్రీకరించిన ‘సారంగధరియా ..’ పాట ఇప్పటికే పాప్యులర్ అయింది .. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
- Advertisement -