మీటూ అనే ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు గతంలో జరిగిన చేదు అనుభవాలను బహిరంగా చెప్పుకొస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ జరీన్ ఖాన్ తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని.. బాలీవుడ్‌కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని… ఎంతో మంచి వ్యక్తిలా తనతో మాట్లాడేవాడని జరీన్ తెలిపింది.
ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని.. అందులో ముద్దు సన్నివేశం ఉంటుందని.. దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని తనను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. తనను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడని తెలిపింది. సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, తనను నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పింది. ఆ తర్వాత అతని బారి నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది.