ఈటల రాజెందర్ ప్రెస్‌మీట్ అనగానే ఆయన కభ్జాలతో భూములు కోల్పోయిన వాళ్లు ఆనందించారు, తాను ఆక్రమించిన భూముల్ని తిరిగిస్తానని ఈటల చెప్తాడనుకొన్నారు కానీ అదేమీ లేకపోవడంతో వారిని మరోసారి మోసం చేశాడు ఈటల.. ఆత్మగౌరవం అని పదే పదే మాట్లాడుతున్న ఈటల ఆ పేరుతో యావత్ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, తనకు ఆత్మగౌరవం ఉంటే ఢిల్లీలో దాన్ని ఎవరికి తాకట్టు పెట్టారో చెప్పాలి. కారుకు ఓనర్లమని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఢిల్లీకి వెల్లి క్లీనరయ్యాడని మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవ చేశారు. ఈ రోజు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు.
నల్లదనాన్ని వ్యతిరేకిస్తున్నామని మాటలు చెప్తున్న బీజేపీ ఈటల కభ్జా వ్వవహారంపై ఏమని స్పందిస్తుంది. బిజేపీ అధ్యక్షుడు నడ్డాగారి దగ్గర ఏ విదమైన హామీలు పొందారో, తన నల్లచర్యల్ని తెల్లగా చేస్తామనే హామీని ఇచ్చారో లేదో ఈటల చెప్పాలన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నా అనే ఈటల ఇవ్వాల నడ్డాగారి దగ్గర వారి గురించి ఏమన్నా ప్రస్థావించారా… ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని నడ్డాగారితో చర్చించి హామీ పొందారా? వెనుకబడిన కులాలకు ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ కావాలనే ప్రధాన డిమాండ్ పై ఏమన్నా హామీ లబించిందా? వ్యవసాయ నల్లచట్టాల్ని రద్దుచేస్తామని నడ్డా గారి దగ్గర ఈటలకు హామీ లభించిందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా అని గంగుల అన్నారు. వీటికి సంబందించి బీజేపీ అధిష్టానం నుండి వచ్చిన సమాదానం ఏంటి? వీటి గురించి కనీసం పల్లెత్తు మాట మాట్లడకుండా కేవలం తన ఆస్థుల్ని రక్షించుకోవడం కోసం మాత్రమే తన ఆత్మగౌరవం పేరుతో ఈటల డ్రామాలు చేస్తున్నారు. బిజేపీకి చెందిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటే ముందుగా ఈటల ఆక్రమించుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ లాండ్లను సరెండర్ చేశాక తీసుకోవాలని మంత్రి గంగుల సవాల్ చేశారు. పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా తను ఆక్రమించిన భూముల్ని బడుగు బిడ్డలకు తిరిగిచ్చాక పార్టీలో చేర్చుకోవాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు.
దేశం కోసం, ధర్మం కోసం అని ప్రవచించే బీజేపీ భక్తిగల వారైతే దేవుడైన రాముని భూముల్ని తిరిగిచ్చిన తర్వాతే ఈటలను పార్టీలో తీసుకోవాలి. ఏనాడు బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల గురించి అసెంబ్లీ, కాబినేట్లలో ప్రస్థావించని ఈటల అవుటర్ రింగ్ రోడ్డు గురించి, తన భూముల క్రమబద్దీకరణ గురించి అందరి చూట్టూ తిరగానని తనే ఒప్పుకున్నాడు. సీఎంవోలో బిసి, ఎస్సీలు లేరంటున్న ఈటలకు ఇప్పుడే ఇవి గుర్తుకొచ్చాయా, తన పౌల్ట్రీ వ్యాపార భాగస్వాముల్లో ఒక్క బడుగుబలహీన వర్గాల వ్యక్తి ఎందుకు లేడు? ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడం చూసి జీర్ణించుకోలేక పోతున్నాడు ఈటల. దళితులు, బీసీలు ఎదిగితే ఈటల ఏనాడు జీర్ణించుకోలేదు, 2014 నుండి వరుసగా మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు సైతం పార్టీలో సీనియర్లను కాదని ఈటలను సీఎం గౌరవించారు, ప్రజాప్రతినిదిగా చట్టాన్ని అతిక్రమిస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. గేటు వద్దనుండే వెనక్కి పంపారు అంటున్నాడు, ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవంకు ఇబ్బంది కలిగిందన్న ఈటల ఇన్ని రోజులు పదవిని పట్టుకొని ఎందుకు ఊగిసలాడారు. బానిసలకు నిలయం ప్రగతి భవన్ అని అంటున్న వ్యక్తి ఏడేళ్లుగా ఎందుకు అక్కడే పదవిని పట్టుకొని ఊరేగాడు, కేవలం పదవీకాంక్ష తప్ప ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడుంది, అనాడే ఎందుకు రాజీనామా చేయలేదు. షేడ్యూల్ అయిన పనులతో బిజీగా ఉండే సమయంలో కలెక్టరైనా అపాయింట్మెంట్ లేకుండా ఎలా రానిస్తాడు. మమ్మల్ని ఏనాడు ముఖ్యమంత్రి కలువకుండా నిరాకరించలేదు. ఇన్నాళ్లు దేవుడిలా కనిపించిన కేసీఆర్ ఇవ్వాళ అక్రమ భూములపై చర్యలు తీసుకోగానే ధయ్యం ఎలా అయ్యారు? అని గంగుల మండిపడ్డారు.
దేవరయాంజల్ దేవుడి భూముల్ని, బడుగు బలహీన వర్గాల భూముల్ని వారికిప్పిచ్చాక తన పౌల్ట్రీ ఫాంలతో సహా బీజేపీ పార్టీలోకి తీసుకోనేలా పునరాలోచించాలి. హుజురాబాద్‌లో బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఓట్లు సైతం ఈటెల చేరడంతో కోల్పోయారు, తనచుట్టూ తిరుగుతున్న వ్యక్తుల్ని కొనుక్కున్నాడా అని, ప్రజల్ని అమ్ముడుపోయారని వాఖ్యానించడం సిగ్గుచేటు, ఇన్ని రోజులు తాను అక్కడ గెలిచింది కేవలం కేసీఆర్ బొమ్మతోనే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సైతం హుజురాబాద్‌లో గులాబీజెండా రెపరెపలాడుతుంది, టీఆర్ఎస్ దే గెలుపు ఖాయం ఎన్నిక ఏదైనా కేసీఆర్ బొమ్మే గెలిపిస్తుంది. ఈ సందర్భంగా భవిష్యత్తులో సైతం బడుగు బలహీన వర్గాల పేరు చెప్పుకొనే అర్హత ఈటల రాజేందర్ కి లేదు, ఎక్కడా వారిని వాడుకోవద్దు అని మంత్రి గంగుల విమర్శించారు.