తెలంగాణ పోలీసులకు ఉత్తమ సేవా అవార్డులు..

24
Telangana police

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం హైదరాబాద్ నగర పోలీసులకు ఉత్తమ సేవా అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ చేతుల మీదుగా కరోనా విపత్కర పరిస్థితులలో ఉత్తమ సేవలు అందించిన 87 మంది పోలీసులకు పోలీస్ కమిషనర్ అవార్డు లను అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ చౌహన్,డిసిపి సునీతా రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రహీతలను సిపి అంజని కుమార్ అభినందించారు.