రాష్ట్రంలో కొత్త‌గా 2,261 పాజిటివ్ కేసులు..

144
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,261 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మంది మ‌ర‌ణించిన‌ట్లు ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 3,043 మంది బాధితులు కోలుకున్నార‌ని ఆయన పేర్కొన్నారు. రాష్ర్టంలో క‌రోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి త‌గ్గిందని.. అలాగే రిక‌వ‌రీ రేటు 99.5 శాతంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్ర‌మే ఉంద‌న్నారు. 87 ల‌క్ష‌ల‌కు పైగా ఇండ్ల‌లో రెండో ద‌శ ఫీవ‌ర్ స‌ర్వే పూర్తి చేశామ‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా త‌గ్గిపోయింద‌న్నారు. గ్రామాల్లోనూ ప‌క‌డ్బందీగా లాక్‌డౌన్ అమ‌లు కావాల‌న్నారు. గ్రామాల్లో క‌రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గించేందుకు ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.

కరోనా కేసుల సంఖ్య 5.83 లక్షలకు చేరుకోగా 3313 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 5.46 లక్షల మంది కోలుకోగా 33 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. 1.5 కోట్ల మందికి కరోనా టెస్టులు చేయగా 62.1 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -