టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం కాంగ్రెస్‌ నాయకులు..

26
trs

ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీని వీడి 200 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఇస్సాక్ షేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫరీద్ ఖాద్రితో పాటు 200 మంది నాయకులు, కార్యకర్తలు జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మంత్రి పువ్వాడ

అంతకుముందు వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సలు పొందిన అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు మంజూరైన చెక్కులను మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పటిస్తూ అందజేశారు. మొత్తం 94 మందికి గాను రూ.42.58 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు రూ.5.83 కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.