టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ద్రోహం చేయాలని చూసిన ఊరుకోమన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. కమలాపూర్ మండలంలోని 24 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయిన వినోద్ కుమార్…సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురునిలిచే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు.
పార్టీలు మారే వాళ్లతో టీఆర్‌ఎస్‌కు నష్టం ఏమీ లేదని… బంగారు పల్లెంలో పెట్టి హుజురాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఈటలకి ఇచ్చారు. కానీ వారు ఈరోజు దాన్ని కాపాడుకోలేకపోయారన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటూ ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని వచ్చిన మీ అందరిని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందన్నారు. కమలాపూర్ మండలంలో కార్యకర్తలకు అండగా నేనుంటానని కమలాపూర్ మండల ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిహామీనిచ్చారు.