అన్ లాక్..గుజరాత్‌లో భారీ సడలింపులు

40
lockdown

కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం భారీగా సడలింపులు విధించింది. జూన్ 4 నుంచి రాష్ట్రంలోని 36 న‌గ‌రాల్లో అన్ని దుకాణాల‌ను ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ తెరిచిఉంచేందుకు అనుమతించింది.

జూన్ 4 నుంచి 11 వ‌ర‌కూ ఆయా న‌గ‌రాల్లో రాత్రి క‌ర్ఫ్యూను విధించ‌నున్న‌ట్టు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. రెస్టారెంట్లు, హోట‌ళ్ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ హోం డెలివ‌రీ స‌ర్వీసును అందించే వెసులుబాటు క‌ల్పించింది.

గుజరాత్‌లో గత 24 గంట‌ల్లో 1561 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 22 మంది మృతిచెందారు.