రెండో హరిత విప్లవానికి నాంది పలికిన సీఎం కేసీఆర్: కేటీఆర్

111
ktr
- Advertisement -

సీఎం కేసీఆర్ రెండో హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్…సర్దార్‌పూర్‌లో మార్కెట్ యార్డు పనులు,బెటాలియన్ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డ‌బ్బులు జ‌మ అవుతాయ‌ని చెప్పారు. రైతుబంధు డ‌బ్బులు జ‌మ అయ్యేలోపు భూ స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్‌, ఆర్డీవోకు సూచించారు. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేక డ్రైవ్‌ను చేప‌ట్టామ‌ని తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని…. రైతుల‌ను ఆదుకోవ‌డానికి అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల మెట్ట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వ‌రి దిగుబ‌డి వ‌చ్చింద‌న్నారు. వేస‌విలో కూడా అప్ప‌ర్ మానేరు మ‌త్త‌డి దుంకుతోంద‌న్నారు. సిరిసిల్ల రైతుల‌కు అధునాత‌న మార్కెట్‌యార్డును నిర్మించామ‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -