- Advertisement -
వెద పద్దతిలో వరి సాగుతో మంచి లాభాలు పొందవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం పెద్ద లింగారెడ్డి గ్రామంలో పంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వరిలో మూస పద్ధతికి స్వస్తి చెప్పి ప్రత్యక్ష సాగుకు రైతులు ఆసక్తి చూపాలన్నారు. వెద పద్ధతిలో వరిని సాగు చేస్తే పెట్టుబడులు తగ్గవని, నాట్లకు ముందు కొట్టాల్సిన పని ఉండదన్నారు.
రైతు పంగ ఎల్లారెడ్డి మాట్లాడుతూ… ఎకరానికి 10 కిలోల విత్తనాలు సరిపోతాయని… కలుపు 20 రోజులకు స్ప్రే చేయాలని, దిగుబడి ఎక్కువగా వచ్చిందని తెలిపారు. ఎల్లుపల్లి గ్రామ రైతు వెంకట్ రెడ్డి వెదజల్లే పద్ధతిలో సాగు చేసి ఎకరానికి 40 క్వింటాళ్లు 5 ఎకరాలలో పంట పండించాడన్నారు.
- Advertisement -