అయోధ్య రామాలయ నిర్మాణం…అప్‌డేట్

148
ayodhya
- Advertisement -

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది రామ తీర్థ ఆలయ ట్రస్ట్. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది ట్రస్ట్.

ఈ ఏడాది అక్టోబ‌ర్ నాటికి పునాది ప‌నులు పూర్తి అవుతాయ‌ని శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. సుమారు ల‌క్షా 20 వేల చ‌ద‌ర‌పు ఫీట్ల విస్తీర్ణంలో 40 నుంచి 45 లేయ‌ర్ల‌లో కాంక్రీట్ వేయ‌నున్నారు. ఇప్ప‌టికే నాలుగు లేయ‌ర్లు పూర్తి చేసిన‌ట్లు చెప్పారు.

ఆల‌య నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైన ఇంజినీర్లు, కార్మికులు అంతా ఆరోగ్యంగా, సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ట్ర‌స్టు పేర్కొన్న‌ది. ప్ర‌తి రోజు రెండు ఫిఫ్ట్‌లుగా ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు ట్ర‌స్టు కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ తెలిపారు. ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

- Advertisement -