కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. సేవా హీ సంఘటనలో భాగంగా ముషీరాబాద్‌లో జీహెచ్ఎంసీ కార్మికులు, ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అనాధ పిల్లల చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజలు లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని …లాక్ డౌన్ సడలింపు అంశం ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని పెంచడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొస్తున్నారన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ప్రజలు కరోనా బారిన పడొద్దని సూచించారు.
డిసెంబర్ నాటికి అందరికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. టీకాలు అందేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పడ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.