- Advertisement -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో షాకిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం సమాచారం ఇచ్చింది. యాస్ తుఫాన్‌పై ప్రధాని నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను తాము ఉపయోగించదలచుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నిన్న సమాచారం పంపింది. తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ముగిసిన మమతా- మోదీ మధ్య నడుస్తున్న వార్ ఇంకెంత కాలం ఉంటుందో వేచిచూడల్సిందే.
- Advertisement -