- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చగా రోజుకు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. కరోనా ఫ్రంట్ వారియర్స్‌గా ఉన్న డాక్టర్లు,వైద్య సిబ్బంది మృత్యువాతపడుతున్నారు. దేశవ్యాప్తంగా 420 మంది వైద్యులు మరణించారని ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేష (ఐఎంఏ).
ఇందులో కేవలం ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మృతిచెందారని తెలిపారు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే వైద్యులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
సెకండ్ వేవ్‌లో రికార్డు స్ధాయిలో రోజుకు 4 లక్షలపైగా మృతిచెందగా రోజుకు 4 వేల సంఖ్యలో మృతిచెందారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌తో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
- Advertisement -