ఈటలకు షాక్‌..టీఆర్ఎస్‌ వెంటే ఉంటాం: సర్పంచ్‌లు

139
etela
- Advertisement -

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపల్ ఛైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, ఎంపీపీ,ఎంపీటీసీ,జడ్పీటీసీలు టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టం చేయగా తాజాగా సర్పంచ్‌లు సైతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్‌లోనే ఉంటామని తెలిపారు.

ప్ర‌జా సంక్షేమం కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న మ‌హ‌నీయుడు సీఎం కేసీఆర్ అని …ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన కేసీఆర్ వెంటే తామంతా ఉంటామ‌ని స్పష్టం చేశారు. క‌మ‌లాపూర్ మండ‌లంలో పార్టీ బ‌లోపేతానికి త‌మ‌వంతు కృషి చేస్తామ‌ని స‌ర్పంచులు తేల్చిచెప్పారు.

ఈట‌ల రాజేంద‌ర్ బ‌ర్త‌ర‌ఫ్‌తో త‌మ‌కు నిజ‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చింద‌న్నారు. ఈట‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. ఈట‌లవి స్వార్థ‌పూరితరాజ‌కీయాలు అని మండిప‌డ్డారు. ఎవ‌రెన్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసినా భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్పంచులు ల‌డే గోపాల్, పింగ‌ళి ర‌వ‌ళి రంజిత్ రెడ్డి, కంచ‌ర‌కుంట్ల విజేంద‌ర్ రెడ్డి, ఇనుగాల కిర‌ణ్మ‌యి విజ‌య్ కుమార్, దొంగ‌ల తిరుప‌త‌మ్మ శ్రీనివాస్, ఈ దేవేంద‌ర్ రావు, ముజీబ్ హుస్సేన్, శ్రీధ‌ర్ రావుతో పాటు ఇత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -