అన్ని జిల్లాలలో రైతులకు అందుబాటులో ఎరువులు..

150
niranjan reddy
- Advertisement -

అన్ని జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఎరువులు ఉన్నాయని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి… రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం మన రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను కంపెనీలు ప్రతి నెలా డ్రా చేసి సకాలంలో సరఫరా చేయాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయని…. మార్క్ ఫెడ్ వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఎప్పుడూ సిద్దంగా ఉంచుతున్నామని చెప్పారు.

అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల నిల్వ కోసం అందుబాటులో ఉన్న గోదాములు అన్నింటినీ ఉపయోగించుకోవాలన్నారు. వానాకాలం రాక ముందే రైల్వే రేక్ పాయింట్ల నుండి డిమాండ్ కు అనుగుణంగా అన్ని జిల్లాలకు ఎరువులు పంపించాలన్నారు.

కరోనా మూలంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, ఎరువులు కంపెనీ యాజమాన్యాలు దృష్టి సారించాలన్నారు. ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను అందరూ పాటించాలి…నోడల్ ఏజెన్సీలు, ఎరువుల కంపెనీలు, అధికారులు వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. హాకా భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి , అగ్రోస్ ఎండీ రాములు, ఎన్ ఎఫ్ సీఎల్, క్రిబ్ కో, స్పిక్, ఐపీఎల్, ఆర్ సీ ఎఫ్, సీఐఎల్, ఎన్బీసీఎల్ ఎరువుల కంపెనీల ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -