పావలా శ్యామలకు ‘చిరు’ సాయం

168
chiru
- Advertisement -

సినీయర్ నటి పావలా శ్యామలకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను చూసి స్పందించారు చిరు. ఆమెకు రూ. 1 ల‌క్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో శ్యామల తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.

గతంలో సైతం పావలా శ్యామలకు అండగా నిలిచారు చిరంజీవి. తన కుమార్తె శ్రీజ చేతుల మీదుగా 2ల‌క్ష‌లు రూపాయలు అందించారు.

- Advertisement -