- Advertisement -
ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకుని తిరుగుతున్న భారత సీనియర్ రెజ్లర్ సశీల్ కుమార్ కుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుశీల్ ఆచూకీ చెబితే రూ.లక్ష, అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
15 రోజులుగా కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ కోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల గాలింపులు చేపట్టారు. అయినా, ఎలాంటి ప్రయోజం లేకపోయింది. మరో వైపు ఇవాళ ఢిల్లీ రోహిణి కోర్టులో సుశీల్‌కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
ఈ నెల 4న దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకోగా.. సాగర్ దండక్ అనే రెజ్లర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేయడంతోనే తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేశారు.
- Advertisement -