- Advertisement -
వాహనదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ఈ నెలలో 10వ సారి పెట్రోల్,డీజీల్ రేట్లు పెంచి షాకిచ్చాయి. దీంతో దేశంలో రికార్డు స్ధాయికి చేరుకున్నాయి పెట్రోల్ ధరలు. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరను లీటరుకు 23-27 పైసలు, డీజిల్‌ను 27-31 పెంచాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.50, డీజిల్ ధర రూ.91.04గా ఉండగా ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 92.85,డీజిల్ ధర రూ .83.51 గా ఉంది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్ ధర 99.14, డీజిల్ రూ.90.71గా ఉంది.
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.95.94, డీజిల్ ధర రూ.88.53గా ఉండగా జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.99.30, డీజిల్ ధర రూ.92.18గా ఉంది. పాట్నాలో పెట్రోల్ ధర రూ.95.05, డీజిల్ ధర రూ.88.75గా ఉండగా లక్నోలో పెట్రోల్ ధర రూ.90.57, డీజిల్ ధర రూ.83.89గా ఉంది.
- Advertisement -