ఇంటింటా ఫీవర్ పరీక్షలు.. స‌త్ఫ‌లితాలిస్తోంది : వినోద్ కుమార్‌

144
vinod
- Advertisement -

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లో ఉండేలా సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఇంటింటా జ‌రుగుతున్న వైద్య ప‌రీక్ష‌లను ఆరా తీశారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అత్భుతమైన ఫలితాలను ఇస్తున్న‌ట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి చాలా గొప్పదని కొనియాడారు.

కరోనా బారిన పడకుండా ప్రజలు క్రమం తప్పకుండా మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజేషన్ సహా ఆరోగ్య నిపుణుల‌ సూచనలను అమలు చేయాలని కోరారు.

- Advertisement -