ప్రస్తుత కరోనా ఉధృతిలో ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన హై-పవర్ కమిటీ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. పోలీస్, టాస్క్ ఫోర్స్, మెడికల్ & హెల్త్, డ్రగ్ కంట్రోల్ అధికారులు, IMA,మున్సిపాలిటీ, ఇతర శాఖ ఉన్నతతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత, బెడ్స్, మెడిసిన్, ఇంటింటికి జ్వర సర్వే పై సమీక్షించారు. రెండవ దశలో వైరస్ ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, DM&HO మాలతి, ACP రామానుజం(టాస్క్ ఫోర్స్), ప్రదీప్ కూరపాటి(IMA) తదితరులు ఉన్నారు.