ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడినది . ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం,మధ్య ట్రోపో స్ఫేయార్ ఎత్తు వరకు కొనసాగుతున్నది.ఈ అల్పపీడనం మరింత బలపడి సుమారుగా 16వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉంది. నిన్నటి ఉత్తర – దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి ఈ రోజు ఆగ్నేయ మధ్య ప్రదేశ్ దాని పరిసరప్రాంతాల నుండి విదర్భ,తెలంగాణ మరియు రాయలసీమల మీదగా దక్షిణ తమినాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వరకు ఏర్పడినది.
రాష్ట్రంలో వాతావరణ సూచన:
రాగల 3 రోజులు (13,14,15వ తేదీలు) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాతావరణహెచ్చరికలు:
రాగల 3రోజులు (13,14,15వ.తేదీలు) ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు(గంటకి 30 నుండి 40 కి మి వేగం) కూడిన వర్షం(ముఖ్యంగా ఈ రోజు దక్షిణ, మధ్య,తూర్పు జిల్లాలలో వచ్చే అవకాశం) ఒకటి,రెండు ప్రదేశాల్లో తెలంగాణా రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుఫాను ప్రభావం తెలంగాణా రాష్ట్రంలో 16,17వ తేదీలలో వుండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చారించింది. ( ముఖ్యంగాదక్షిణ తెలంగాణా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా వుండవచ్చు).