భజ్జీకి సాయం చేసిన సోనూసూద్!

315
bajji
- Advertisement -

సినిమాల్లోనే ఆయన ప్రతినాయకుడు నిజ జీవితంలో మాత్రం ఆయన హీరోనే.కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న సోనూసూద్…తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ దేవుడైపోయారు.

సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి వార్తల్లో నిలుస్తున్న సోనూ..భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్‌కు సాయం చేశారు. తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సాయం కోరగా సోనూసూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు.

వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి అని ఆశీర్వదించారు.

- Advertisement -