- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3,62,720 పాజిటివ్ కేసులు నమోదుకాగా 4136 మంది మరణించారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి.
మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
గత 24 గంటల్లో బ్రెజిల్‌లో 25,200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఇండియా తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది.
- Advertisement -