లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుముఖం: కేజ్రీవాల్

167
kejriwal
- Advertisement -

ఢిల్లీలో లాక్‌ డౌన్ విజయవంతమైందని….ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు సీఎం కేజ్రీవాల్. మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్…వచ్చే మూడు నెలల్లో ఢిల్లీ వాసులందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. కానీ టీకాల కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొద్ది రోజులకే స్టాక్‌ మిగిలి ఉందని చెప్పారు.

గత కొద్ది రోజులుగా ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచామని, జీటీబీ హాస్పిటల్‌ సమీపంలో 500 కొత్త ఐసీయూ పడకలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఐసీయూ పడకలు, ఐసీయూ కొరత లేదని

రెండు కంపెనీలు మాత్రమే ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలుగుతాయన్నారు. ఇలా ఐతే ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి రెండేళ్లు పడుతుందన్నారు. టీకాలు వేసేందుకు జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్రాన్ని కోరారు కేజ్రీవాల్.

- Advertisement -