తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు..

182
Night curfew
- Advertisement -

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ ఉద‌యం 5 గంట‌ల‌ వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. మొద‌ట్లో 8వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూని పొడిగించిన ప్ర‌భుత్వం తాజాగా మ‌రోవారం పాటు పొడిగిస్తూ ఆదేశాలు వెలువ‌రించింది. తాజాగా కరోనా కట్టడికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

నూతన మార్గదర్శకాలు ఇవే..
-శుభకార్యాలు, పెళ్లిలకు 100 మందికి మించి హాజరు కాకూడదు.
-శుభకార్యాలకు హాజరైన ప్రతి ఒక్కరు భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
-దహన సంస్కారాలకు 20 మందికి మించి పాల్గొనకూడదు.
-దహన సంస్కారాలకు కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలి.
-రాజకీయ కార్యక్రమాలు,సభలు సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు,వినోదం,క్రీడాలు నిషేధం.

- Advertisement -