టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

162
MI vs CSK
- Advertisement -

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో ఈరోజు కీలక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి, సులువుగా లక్ష్యాన్ని ఛేదించాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్, నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో ధవళ్ కులకర్ణి ముంబయి జట్టులోకి వచ్చారు. అటు, చెన్నై జట్టులో ఎలాంటి మార్పుల్లేవని ఆ జట్టు కెప్టెన్ ధోనీ తెలిపాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆరు మ్యాచ్‌లాడగా చెన్నై ఐదు మ్యాచ్‌లను గెలుచుకొగా.. ముంబై మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో పోటీ పడగ.. వాటిలో ముంబై 18 మ్యాచ్‌లు.. చెన్నై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, ఎంఎస్ ధోని (w / c), రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్

- Advertisement -