- Advertisement -
మరోసారి అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడగించింది కేంద్రం. మే 31 నిషేధాన్ని విధించిన కేంద్రం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది.
అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని చెప్పింది. అలాగే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ ప్రయాణ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ వెల్లడించింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
- Advertisement -