ఒకే వ్యాక్సిన్ రెండు ధరలేంటి: సుప్రీం

116
supreme court

మే 1 నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు అందించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోవ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీం. ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధ‌ర‌లు ఎందుక‌ని… ఉత్ప‌త్తి అయిన వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్ర‌మే ఎందుకు కొనుగోలు చేయ‌డం లేదని ప్రశ్నించింది.

18-44 ఏళ్ల వ‌య‌సు వారికి ప్ర‌భుత్వ‌మే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్య‌మ‌ని వ్యాఖ్యానించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి అవుతున్నాయో మాకు తెలుసు…. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచాల్సిందే అని సుప్రీం స్పష్టం చేసింది.

59.46 కోట్ల మంది భార‌తీయులు 45 ఏళ్ల లోపు వాళ్లే. వీళ్ల‌లో చాలా మంది నిరుపేద‌, అణ‌గారిన వ‌ర్గాలే. వాళ్లు వ్యాక్సిన్ల‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి తెస్తారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది.