- Advertisement -
ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుకి బుధవారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌లో కచ్చితమైన ఫలితం రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గు ముఖం పట్టే క్రమంలో.. ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
- Advertisement -