టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆయన డీలాపడిపోలేదు. వినాయక్ దర్శకత్వంలో హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేయడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించగానే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది.
అయితే ఈ హీరో మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం కర్ణన్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ఈ హీరో చూస్తున్నాడట. అంతేకాదు ఇప్పటికే ఈ హీరో ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడని టాక్. అయితే ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత ‘కర్ణన్’ రీమేక్ షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సివుంది.