ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ గెలుపు..

220
rcb
- Advertisement -

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఢిల్లీపై ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో గెలిచి ఉపిరి పీల్చుకుంది. ఆర్సీబీ విధించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 170 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు), షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిన ఏబీ డివిలియర్స్ విశ్వరూపం చూపించాడు. కేవలం 42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగగా… రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. ఆర్సీబీ భారీ స్కోరు సాధించడంలో కీ రోల్ పోషించిన ఏబీకి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ లభించింది.

- Advertisement -