20 ఏండ్ల ప్రస్థానంలో టీఆర్ఎస్ ఒక సంచలనం- మంత్రి జగదీష్ రెడ్డి

161
minister jagadish reddy
- Advertisement -

ఎటువంటి అలజడులకు, అరాచకాలకు తావు లేకుండా గాంధీ చూపిన మార్గానికే వన్నె తెచ్చిన యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శాంతియుత స్వభావానికి జాతిపిత మారుపేరు అయితే అదే శాంతి స్వభావానికి మరింత పదును పెట్టి గమ్యాన్ని చేరుకున్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. టిఆరఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ తన నివాస గృహంలో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలు పురస్కరించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాదా సీదాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ పొందు పరచిన అంశాన్ని అవకాశంగా వినియోగించుకుని తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనమైన చరిత్ర టి ఆర్ ఎస్ పార్టీది, అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. రాజకీయ పార్టీతో ఉద్యమాన్ని సాధించి లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా,వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించి భారత దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు గడించారన్నారు. 20 ఏండ్ల ప్రస్థానంలో టి ఆర్ ఎస్ పార్టీ పుట్టుకయే ఒక సంచలనం సృష్టిస్తే,పార్టీ ఆవిర్భావం తరువాత 20 ఏండ్లుగా అనేక అపురూప ఘట్టాల ఆవిష్కరణకు వేదికగా గులాబీ పార్టీ నిలిచిందన్నారు. కుట్రలు,కుతంత్రాలు ద్రోహలను తట్టుకోవడమే కాకుండ లక్ష్య సాధన కొరకు చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని ఆయన చెప్పారు.

ఉద్యమంతో పాటు అధికారంలోకి వచ్చాక కూడా ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ భారత దేశ రాజకీయలకే టి ఆర్ ఎస్ పార్టీ ఒక తలమానికంగా నిలిచిందన్నారు. దేశ రాజకీయ చిత్ర పటంలో పార్టీ సభ్యత్వం కోసం బారులు తీరిన అరుదైన సందర్భం ఒక్క టి ఆర్ ఎస్ పార్టీలో మాత్రమే సాధ్యపడిందన్నారు.సమైక్య రాష్ట్రంలో దారుణంగా నష్టపోయిన జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లా మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేవలం ఆరు అంటే ఆరు ఏండ్లలోనే వరి దిగుబడిలో మొదటి స్థానానికి వచ్చి యావత్ భారతదేశంలోనే వ్యవసాయయోగిత జిల్లాగా రికార్డ్ సృష్టించిందన్నారు. నదులలో నీళ్లు ఉండి, ఆ నీటి మీద హక్కులు ఉండి నాగార్జున సాగర్ తలమీద ఉండి కూడా 2014కు పూర్వం సాగునీరు కాదు కదా త్రాగు నీటికి కూడా నోచుకోలేక పోయామని ఆయన అన్నారు. అటువంటి జిల్లా ఎడారిగా మారి పాతాళం నుండి వచ్చిన నీరు విషం అని తెలిసి కూడా గొంతులో పూసుకుంటే లక్షలాదిమంది ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడ్డారని ఆయన గతాన్ని గుర్తుచేశారు.

అటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న జిల్లా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదట లబ్ది పొందిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కురిపించిన అవిభాజ్యమైన ప్రేమాభిమానాలు చూపిన కరుణ అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.2014 కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేవలం రెండు లక్షల ఎకరాల సేద్యనికే పరిమితమైన వ్యవసాయం ఈ యాసంగి నాటికి 11 లక్షల 50 వేల ఎకరాలకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాను ఎప్పటికీ రుణ పడి ఉంటామని అధినేత చల్లని చూపుతోటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు,దామరచర్ల వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ వంటి అద్భుతాలు నిర్మితమైనాయన్నారు.

- Advertisement -