కరోనా కట్టడిలో కేంద్రం విఫలం- ఓవైసీ

267
Owaisi
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోన వైరస్ విజృంభించిందని విమర్శలు చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు ఆగాపుర దారుసలంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. దేశంలో కరోణవల్ల ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఇప్పటికైనా కరోనా వైరస్‌ను వారి కట్టడంలో చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోడు ఆవుతున్నాయి. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్‌లో నూతనంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వానీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల వల్ల బెడ్లు నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పాటికి ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తే కనీసం ప్రజలకి, రోగులకు వైద్యసేవలు అందడం వల్ల వెసులుబాటు కలిగేది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అనవసరంగా అపోజిషన్ పార్టీలు కోర్టుకు వెళ్లాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.

- Advertisement -