దాదాపు పది సంవత్సరల తర్వాత టాలీవుడ్‌కి, ఎంటర్‌టైన్ మెంట్‌కి దూరంగా ఉన్న మాట మూమ్మటికి వాస్తవం. మళ్లీ సినిమా చెయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆడియెన్స రియాక్షన్ ఎలా ఉంటుంది. నన్నెలా ఎలా రిసీవ్ చేసుకుంటారు. గతంలో ఉన్న చూపిన ప్రేమాభిమానాలు ఇప్పుడు చూపిస్తారా? అని నాకు అనుమానం ఉండేది. నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘ఖైదీ నంబర్ 150’ను ప్రేక్షకులు ఆదరించిన తీరు, ఆప్యాయతను ఎప్పటికీ మరచిపోలేను’’ అని చిరంజీవి అన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో ‘మా’టీవీ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ‘‘150వ సినిమా అయిపోయింది. తర్వాత ఏంటి అనుకుంటున్న సమయంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం కలిగింది’’అని చిరంజీవి అన్నారు. స్టార్‌మాలోగో అవిష్కరణలో చిరంజీవి మాట్లాడుతూ…మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేయటం తనకు ఎమోషనల్ జర్నీ అని చెప్పారు. గతంలో సినిమా ఒక్కటే ప్రేక్షకులకు వినోదం ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లూ సినిమాలకు సమానంగా వినోదం అందిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఖైదీ150 తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడుతో ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ వచ్చిందని…ఈషో మరో లెవల్‌కి వెళ్లడానికి నా ఇమేజ్ దోహదపడుతుందని ఆయన అన్నారు.
ఈ షోలో కొన్ని ఎపిసోడ్‌లకు అతిథులుగా నాగార్జున, వెంకటేశ, రాధిక, సుహాసిని వంటి వాళ్లు వస్తున్నారని మెగాస్టార్ తెలిపారు. ‘‘మిత్రుడు బాలకృష్ణను కూడా అతిథిగా ఆహ్వానిస్తా. ఆ మధ్య నా పుట్టినరోజు వేడుకలో నేను, బాలకృష్ణ, సల్మాన్‌ఖాన్ ఉర్రూతలూగించే పాటకు స్టెప్పులేశాం’’ అని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో మా ఛానల్ లోగో ‘స్టార్ మా లోగో’ గా మారనుంది. ప్రతి సోమవారం నుండి గురువారం వరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది.నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు.