డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా….

209
I Wanted to Commit Suicide Pawan Kalyan
- Advertisement -

జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్ హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తనకు నటనపై ఆసక్తి లేదని…యోగిని కావాలనుకునన్నని…. ప్రతిసారి పరీక్షలో తప్పడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని పవన్‌ వ్యాఖనించారు. అంతేకాకుండా తను నక్సల్స్‌ కలిసిపోతానని తన కుటుంబం భయపడేదని….తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి  తిట్టిడంతో తనకు జ్ఞానోదయం అయిందని పవన్‌ ఈసందర్భంగా వ్యాఖ్యనించాడు.

 I Wanted to Commit Suicide Pawan Kalyan

భారత్‌లో చట్టం బలహీనులపై బలంగానూ బలవంతులపై బలహీనంగానూ పనిచేస్తోందని.. అదే మన ప్రధాన సమస్య అన్నారు. చదువులో రాణించలేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఒకదశలో ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని.. అన్నయ్య చిరంజీవి వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్చుకోవాలని కూడా అనుకున్నట్టు చెప్పారు.  కంప్యూటర్‌ కోర్సులు, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌పై దృష్టి సారించానన్నారు. ఇంట్లో వాళ్లకు ఆధ్యాత్మిక లెక్చర్లు ఇచ్చేవాడినన్నారు. ఇలాగే చిరంజీవికి ఏదో ఆధ్యాత్మిక లెక్చర్‌ ఇస్తే.. విసుక్కుని, ఏదైనా సాధించిన తర్వాత ఇవ్వు ఒప్పుకొంటానన్నాడని పవన్‌ వివరించారు. అయితే, చదువులో రాణించనందున వేరే ఏ మార్గం లేక సినిమాల్లోకి వచ్చానన్నారు.

రాజకీయాలపై మాట్లడిన పవన్‌… సమాజాన్ని పరిశీలించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం తనకు చిన్నప్పటి అలవాటని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదోకటి అధికారంలోకి వచ్చాక చేసేదొకటిగా ఉందని పవన్ అన్నారు. రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన  ఉండట్లేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జనసేన పార్టీ ఎప్పుడు న్యాయంపోరాటం చేస్తుందని వ్యాఖనించారు.

 I Wanted to Commit Suicide Pawan Kalyan

అమెరికాటూర్‌లో ఉన్న పవన్‌ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు తెలిపిన ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యలు తీర్చడానికి సంఘీభావం చూపాలని, కలిసి పనిచేయాలని పవన్ పిలుపు నిచ్చారు. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే మనం పడిపోతాం.. జైహింద్‌ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -