కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు: మంత్రి జగదీష్‌రెడ్డి

184
Minister Jagadish Reddy
- Advertisement -

రాష్ట్రంలో మన్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. శనివారం నకరేకల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరుతూ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నకిరేకల్ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. అందరినీ ఒకే తీరుగా చూసి అక్కున చేర్చుకునే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. గతంలో ఎక్కడైనా ఎవరైనా రైతుల గురుంచి ఆలోచించారా అని ప్రశ్నించారు? పెట్టుబడికి షావుకారు వద్దకు వెళ్ళొద్దనేది కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి రూపాయి నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్ వాళ్లు చెప్పినవి ప్రజలు నమ్మొద్దన్నారు.

- Advertisement -