- Advertisement -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారీన పడ్డారు. స్వల్ప లక్షణాలతో తాను కరోనా బారీన పడ్డానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాహుల్. ఇటీవల కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్‌లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు తప్పుకున్నారు.
- Advertisement -