మెట్రో సమయాల్లో స్వల్ప మార్పులు..

139
hmr

రాష్ట్రంలో ఇవాళ్టి నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద‌యం 6:30 గంట‌ల నుంచి మొద‌టి రైలు యథావిధిగా అందుబాటులో ఉండ‌నుంది.చివ‌రి స్టేష‌న్ నుంచి రాత్రి 7:45 గంట‌ల వ‌ర‌కే చివ‌రి మెట్రో రైలు అందుబాటులో ఉండ‌నుంది.

రాత్రి 8:45 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్‌కు మెట్రో రైలు చేరుకోనుంది. ఈ మార్పులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ప్ర‌యాణికులు మాస్కులు, శానిటైజ‌ర్లు వాడాల‌ని మెట్రో అధికారులు సూచించారు.