- Advertisement -
కరోనా మహమ్మారి నుంచి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజల్లో సీయం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని అర్చనలు చేయాలని పూజరులకు సూచించారు. సీయం కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
- Advertisement -