బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా కొత్త చిత్రం..

223
Bigg Boss Sohel
- Advertisement -

సయ్యద్ సోహెల్.. బిగ్‌బాస్ 4 టైటిల్ గెలుచుకోలేకపోయినప్పటికీ మ‌న ఇంట్లో వ్య‌క్తి అనుకునేంత‌గా ప్ర‌తి కుటుంభానికి ద‌గ్గ‌ర‌య్యాడు. ఇప్ప‌టికే బాగ్‌బాస్ 4 కంటెస్టంట్స్ టీవీల‌లో మరియు మూవీస్‌ల‌లో ఆఫర్లను పొందగా స‌య్య‌ద్ సోహెల్ మాత్రం త‌న కొత్త చిత్రాల‌ను చాలా తెలివిగా ఎంచుకుంటున్నారు.

బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా మరియు గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌లలో రూపొంద‌బోయే ఒక ఆసక్తికరమైన చిత్రానికి ఆయన సంతకం చేశారు. ఈ చిత్రం ఒక స‌రికొత్త రొమాంటిక్ ఎంటర్టైన‌ర్‌గా ఉండ‌బోతుంది. స‌య్య‌ద్ సోహెల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రక‌టించారు మేక‌ర్స్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

- Advertisement -