అసత్య ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు:గండ్ర

233
mla gandra
- Advertisement -

తనపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన గండ్ర….రాజ‌కీయంగా త‌న‌కున్న ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకు కుట్ర చేస్తున్నార‌ని మండిపడ్డారు.

రేగొండ మండ‌లం రూపిరెడ్డిప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ బండారి క‌విత‌, ఆమె భ‌ర్త దేవేంద‌ర్‌ను తాను దూషించ‌లేద‌ని, వారే త‌నపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 4వ తేదీన త‌న‌ను వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దాదాపు గంట పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాము. కానీ ఎవ‌రినీ కించ‌ప‌రిచేలా దూషించ‌లేదు అని ఎమ్మెల్యే గండ్ర స్ప‌ష్టం చేశారు.

త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న నియోజ‌క‌వర్గంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉన్నాన‌ని, రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించాన‌ని తేల్చిచెప్పారు.

- Advertisement -