వరంగల్ జిల్లా హన్మకొండ లోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా పరికరాలు, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
అంబేద్కర్ జయంతి రోజున దివ్యాంగుల కు ఉచితంగా పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేస్తుండటం సంతోషించదగ్గ విషయం అన్నారు.
ఆసరా పథకం ద్వారా వికలాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు సీఎం కెసిఆర్….ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో 1.కోటి 33 లక్షలతో, 685 మంది వికాలంగులకు ఈ రోజు పరికరాలు, ఉపకరణాలు అందిస్తున్నాం అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లతో సహాయ ఉపకరణాలను అందిస్తున్నం…13వేల మంది అబ్ధిదారులకు ఈ ఉపకరణాలు అందుతున్నాయన్నారు.
వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పిస్తుంది…వికలాంగుల ఆత్మగౌరవం నిలిచే విధంగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల 92 వేల 680 మంది వికలాంగులకు…నెలకు 3వేల 16 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు ఇస్తున్నం
రాష్ట్రంలో నెలకు 150 కోట్లు, ఏడాదికి 18వందల కోట్లు ఇస్తున్నం అన్నారు.బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు.. మొత్తం 14 రకాలవి అందిస్తున్నం…వికలాంగులు ఆత్మ ధైర్యంతో ఉండాలన్నారు. ఏదో లోపం ఉందని బాధ పడొద్దు….ఒక లోపం ఉన్న వాళ్ళకు దేవుడు అంతకు మించిన శక్తినిస్తాడన్నారు. ఎంతో మంది వికాలంగులు అద్భుతాలు సృష్టించారు…వాళ్ళందరి స్ఫూర్తిగా… మనమంతా ఎదుగుదాం అన్నారు.