ఈ నెల 24న ‘డీజే’ ఫస్ట్‌ లుక్‌..?

360
Stylish Star Allu Arjun's DJ First Look on Feb 24th
- Advertisement -

వరుస విజయాలతో  దూసుకుపోతున్న స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జన్ కి  ‘సరైనోడు’ మరో పెద్ద బ్లాక్‌బాస్టర్‌ ఇచ్చింది. ఈ సినిమాలో బన్ని డిఫెరెంట్‌ క్యారెక్టర్‌ లో నటించి అందర్ని ఆకట్టుకున్నాడు.  మాస్‌ ఆడియెన్స్‌తో పాటు,  క్లాస్‌ ఆడియెన్స్‌ని కూడా తన వైపుకి తిప్పుకున్నాడు. ఈ సినిమాతో మాస్‌ ఆడియెన్స్‌ కు మరింత దగ్గరయ్యాడు బన్ని.  ‘సరైనోడు’ తో అప్పటి వరకు ఉన్న బన్నీ మార్కెట్‌ బద్దలయింది.

ఒక్కసారిగా ఈ సినిమాతో బన్ని మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. ఆ సినిమా వెంటనే మరో సినిమాకి కమిట్ అయ్యాడు బన్ని.  ఆ సినిమా పెరే ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమాతో మళ్ళీ దుమ్మురేపడానికి సిద్దమవుతున్నాడు ఈ  స్టైలిష్‌స్టార్‌. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక్కడే రెండు రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది.Stylish Star Allu Arjun's DJ First Look on Feb 24th

అయితే బన్నీ, పూజా హెగ్డే లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర టీమ్‌ బెంగుళూర్ వెళ్లనుంది. బన్ని ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సక్సెస్ తరువాత హరీష్ శంకర్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్

ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది చిత్ర టీమ్.

- Advertisement -