అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం….

273
us
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని సెయింట్‌ జోసెఫ్‌ హెల్త్‌ రీజనల్‌ ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి క్యాబినెట్‌ తయారీ ఉద్యోగి అని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు.

కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని, గ్రిమ్స్‌ కౌంటీలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -